Share News

రైల్లో కొత్త జంట కోసం హనీమూన్ సూట్.. టీటీఈ సస్పెండ్..

ABN , Publish Date - Jul 09 , 2026 | 09:43 AM

రైలులోని ఓ ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను ఓ జంట హనీమూన్ సూట్‌లా మార్చుకుంది. బెలూన్లు, గులాబీ పూలు, రోజ్ పేటల్స్‌, లైట్లతో క్యాబిన్‌ను తమకు నచ్చినట్టు అలంకరించుకుంది. అందుకోసం ఓ ప్రైవేట్ డెకరేటర్‌ను కూడా నియమించుకుంది.

రైల్లో కొత్త జంట కోసం హనీమూన్ సూట్.. టీటీఈ సస్పెండ్..
Honeymoon Suite Train

రైలులోని ఓ ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను ఓ జంట హనీమూన్ సూట్‌లా మార్చుకుంది. బెలూన్లు, గులాబీ పూలు, రోజ్ పేటల్స్‌, లైట్లతో క్యాబిన్‌ను తమకు నచ్చినట్టు అలంకరించుకుంది. అందుకోసం ఓ ప్రైవేట్ డెకరేటర్‌ను కూడా నియమించుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయింది. ఆ దెబ్బకు ఆ రైలు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఉద్యోగం కోల్పోయారు (Honeymoon Suite Train).


ఈ ఘటన ముంబై సీఎస్‌ఎంటీ-బల్హర్షా-నాందేడ్‌గ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లోని ఫస్ట్ ఏసీ కూపేలో చోటుచేసుకుంది. జల్నాకు చెందిన నూతన దంపతుల కోసం ఆ రైలు క్యాబిన్‌ను ప్రత్యేకంగా బెలూన్లు, పూలమాలలు, రోజ్ పేటల్స్‌తో అలంకరించి హనీమూన్ గదిలా మార్చేశారు. వీడియో బయటకు రావడంతో నెటిజన్లు దీనికి 'ఫస్ట్‌నైట్ ఎక్స్‌ప్రెస్' అనే పేరు కూడా పెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది (TTE Suspended).


రైల్వే అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు (Indian Railways). అనుమతి లేకుండా అలంకరణ బృందాన్ని రైలులోకి రానివ్వడాన్ని విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించారు. విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఘటనపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..


మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 09 , 2026 | 09:46 AM