జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల వాయిదా..
ABN , Publish Date - Feb 16 , 2026 | 06:01 PM
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇవాళ జరగాల్సిన ఎన్నికలను అధికారులు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కోరం లేకపోవడంతో వాయిదా పడ్డాయి. ఇవాళ జరగాల్సిన ఎన్నికలకు అవసరమైన సంఖ్యలో కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో అధికారులు ఎన్నికలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంద్రేశం మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకారం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో జహీరాబాద్ మున్సిపాలిటీలో స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు జహీరాబాద్‌లో స్వతంత్రులను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా చర్యలు చేపడుతోంది. ఈ పరిణామాలతో రెండు మున్సిపాలిటీల్లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మంగళవారం జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి పీఠం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read:
ఎన్నిక వాయిదా వేయడం దుర్మార్గం: ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్.. పెండింగ్ బకాయిలు క్లియర్..
For More Latest News