Share News

రాజ్యాంగ అంతర్లీన స్ఫూర్తిని అర్ధం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:45 AM

తెలంగాణ ఉన్నత విద్యామండలి(టీజీసీహెచ్‌ఈ)లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.

రాజ్యాంగ అంతర్లీన స్ఫూర్తిని అర్ధం చేసుకోవాలి
legal

  • హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రజని

  • బాలకిష్టా రెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

హైదరాబాద్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి(టీజీసీహెచ్‌ఈ)లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ హైకోర్టు విశ్రాం త న్యాయమూర్తి జస్టిస్‌ రజని రాజ్యాంగంలోని లిఖితపూర్వక అంశాలకే పరిమితం కాకుండా, వాటి వెనుక అంతర్లీనంగా ఉన్న స్ఫూర్తి, విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె టీజీసీహెచ్‌ఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టా రెడ్డికి తెలంగాణ మేధావుల ఫోరం తరఫున జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ, దేశ ఐక్యతను పెంపొందించడంలో భారత రాజ్యాంగం పోషిస్తున్న కీలక పాత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మేధావుల ఫోరం అధ్యక్షులు రాజ్‌ నారాయణ, కార్యదర్శి మహమ్మద్‌ అక్బర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 01:46 AM