51 డిపోల్లోటీడబ్ల్యూయూ కూటమి విజయం
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:23 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టిడబ్ల్యూయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) కూటమి సత్తా చాటిందని టిడబ్ల్యూయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి తెలిపారు.
టీడబ్ల్యూయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టిడబ్ల్యూయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) కూటమి సత్తా చాటిందని టిడబ్ల్యూయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 97 డిపోలకు 51 డిపోలలో గెలుపొందగా, 14 రీజియన్లలో 9 రీజియన్లలో ఆధిక్యం సాధించామని ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని టిడబ్ల్యూయూ కార్యాలయంలో మీడియాకు చెప్పారు. బస్‌భవన్ సహా నాన్ ఆపరేషనల్ విభాగంలో ఆర్‌ఎం ఆఫీసులు, వర్క్‌షాపులు కలిపి 8 యూనిట్లలో తమ కూటమి విజయం సాధించిందన్నారు.
ఎంజీబీఎస్, ఈడీ కార్యాలయం, బస్‌భవన్‌తోపాటు రెండు వర్కుషాపు (ఉప్పల్, కరీంనగర్)ల్లో తమ కూటమికి మద్దతు లభించిందని రాజిరెడ్డి వివరించారు. బస్ భవన్‌లో ప్రాతినిధ్యం సాధించడం తమ కూటమికి గల ఆదరణకు నిదర్శనమని, ఖమ్మం, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్ జోన్లలో కార్మికుల మద్దతు లభించిందని చెప్పారు. రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం కోసం జరిగిన క్లాజ్-3 ఎన్నికల్లో 33,257 ఓట్లకు తమ కూటమికి 13,927 ఓట్లు, క్లాజ్-6 పరిధిలో 34,421 ఓట్లకు 15,747 ఓట్లు లభించాయన్న రాజిరెడ్డి.. తమ కూటమికి మద్దతు తెలిపిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
వినోదంలో పెను విషాదం.. ఇంజనీరింగ్ కాలేజీ ఉత్సవంలో ప్రమాదం
ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. బాధితులకు సీఎం రేవంత్ భరోసా