Share News

TGSRTC రిక్రూట్‌మెంట్‌.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

ABN , Publish Date - Aug 03 , 2026 | 08:13 PM

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి (TGPRB) విడుదల చేసింది. మొత్తం 1,743 పోస్టులకు నిర్వహించిన నియామక ప్రక్రియలో 1,604 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

TGSRTC రిక్రూట్‌మెంట్‌.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల
TSRTC Driver Results 2026

ఇంటర్నెట్ డెస్క్: TSRTC డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నియామకానికి సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి (TGPRB) విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు కేటగిరీ వారీగా కట్‌ఆఫ్ మార్కులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్ 17న మొత్తం 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, నియామక ప్రక్రియ అనంతరం 1,604 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు మండలి ప్రకటించింది.


పోస్టుల వారీగా ఎంపికలు

  • డ్రైవర్ పోస్టులు: 1,000

  • ఎంపికైన అభ్యర్థులు: 894 మంది

  • శ్రామిక్ పోస్టులు: 743

  • ఎంపికైన అభ్యర్థులు: 710 మంది

డ్రైవర్ పోస్టులకు హాజరైన అభ్యర్థులు తమ డ్రైవింగ్ టెస్ట్ మార్కుల వివరాలను వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఎంపిక జాబితాలతో పాటు అన్ని కేటగిరీలకు సంబంధించిన కట్‌ఆఫ్ మార్కులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు. దీంతో అభ్యర్థులు తమ ఫలితాలను, కట్‌ఆఫ్ వివరాలను సులభంగా పరిశీలించుకోవచ్చు. ప్రవర్తన పరిశీలనతో పాటు వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే తుది నియామకం ఖరారవుతుంది.


ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 7 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 11 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో డిజిటల్ అటెస్టేషన్ ఫారాన్ని పూర్తి చేయాలి. అనంతరం ఆగస్టు 17న అటెస్టేషన్ ఫారం మూడు ప్రతులతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నిర్ణీత గడువుల్లో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని తెలంగాణ పోలీసు నియామక మండలి సూచించింది.


Also Read:

న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం.. ఎంపీ రఘునందన్ ఏం చెప్పారంటే..

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Aug 03 , 2026 | 08:32 PM