Maoist Leaders: మావోలకు ఊహించని షాక్.. లొంగిపోయిన కీలక నేతలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 09:20 PM
మావోయిస్టులకు వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దళంలోని మరో అగ్రనేత బర్సె దేవా, 15 మంది మావోయిస్టులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు.
హైదరాబాద్, జనవరి1 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు ఉద్యమానికి వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దళంలోని మరో అగ్రనేత బర్సెదేవా తనతో పాటు 15మంది మావోయిస్టులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం బర్సెదేవా తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకటి రెండు రోజుల్లో పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
బర్సెదేవా, ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కరడుగట్టిన మావోయిస్టు నేత హిడ్మాతో కలిసి సుమారు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసినట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)లో కమాండెంట్‌గా పనిచేసిన బర్సెదేవా, అనేక కీలక మావోయిస్టు ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పలు దాడుల్లో బర్సెదేవాది కీలక పాత్ర ఉన్నట్లు ఛత్తీస్‌గడ్ పోలీసులు గతంలోనే పేర్కొన్నారు. ఆయనపై ప్రస్తుతం రూ.50 లక్షల రివార్డు ఉంది.
ఇటీవల భద్రతా బలగాలు చేపడుతున్న ‘ఆపరేషన్ కగార్’ పేరుతో సాగుతున్న వరుస ఎన్‌కౌంటర్లు, కఠిన చర్యల నేపథ్యంలోనే బర్సెదేవా లొంగిపోయినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, దళం బలహీనపడుతున్నడానికి నిదర్శనమని భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ హయాంలో తెలంగాణకు తీరని అన్యాయం.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్
For More TG News And Telugu News