తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:38 PM
తెలంగాణ వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం నాడు రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 11: రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం నాడు రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలకు గౌరవప్రదమైన సేవలే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో ఒకే నమూనాలో కార్యాలయాల నిర్మాణం ఉంటుందన్నారు. అద్దె, శిథిలావస్థలో ఉన్న కార్యాలయాలకు శాశ్వత పరిష్కారం కల్పించనున్నట్లు చెప్పారు. నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో తుది డిజైన్లకు రూపకల్పన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా ఆధునిక సమీకృత భవనాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ORR పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి, మేడ్చల్, పటాన్‌చెరు, కోహెడలో నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. గత ప్రభుత్వం ప్రణాళిక లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని విమర్శించారు. కొత్త మండలాలకు అవసరమైన పోస్టులను భర్తీ చేసి పరిపాలన బలోపేతం చేశామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం క్యూర్ పరిధిలో స్థలాల గుర్తింపు ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
కామారెడ్డిలో తల్లి, ముగ్గురు చిన్నారుల మిస్సింగ్
ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం: మంత్రి ఉత్తమ్
Read Latest Telangana News And Telugu News