Share News

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల

ABN , Publish Date - Apr 29 , 2026 | 02:02 PM

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల
Telangana SSC Results

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 95.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 5 లక్షల 28 వేలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత పొందారు. 5,731 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదవగా.. 6 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. పదో తరగతి ఫలితాలను 8096958096 అనే మీ సేవా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ సేవా వాట్సాప్ నెంబర్‌కు విద్యార్థులు హాయ్ అని మెసేజ్ టైప్ చేయాలి. తర్వాత SSC RESULTS అని టైప్ చేసి హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ఫలితాలను చూడొచ్చు.


  • సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10% ఉత్తీర్ణత

  • తెలుగు మీడియం విద్యార్థుల్లో 89.14% ఉత్తీర్ణత

  • ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల్లో 95.86% ఉత్తీర్ణత

  • ఉర్దూ మీడియం విద్యార్థుల్లో 86.71% ఉత్తీర్ణత

  • ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30% ఉత్తీర్ణత

  • హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23% ఉత్తీర్ణత


ఇవి కూడా చదవండి..

మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు.. నేను అడగలేదు: కోదండరాం

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: మహేశ్ కుమార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 29 , 2026 | 03:24 PM