Share News

బండి భగీరథ్ బెయిల్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

ABN , Publish Date - Jul 06 , 2026 | 04:29 PM

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని బాధితురాలి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

బండి భగీరథ్ బెయిల్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
Telangana High Court

హైదరాబాద్, జులై 6: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని బాధితురాలి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టులో పేట్ బషీరాబాద్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. నిందితుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశాక ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో అభియోగాలను సవరించినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం చేసుకుని, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.


బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి కాబట్టి కేసుపై ప్రభావం చూపుతోందని బాధితురాలి తరఫు న్యాయవాది వాదించారు. దర్యాప్తు దశలో బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఇంకా ఈ కేసులో సాక్షులను విచారణ చేయాల్సి ఉందని.. బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బండి భగీరథ్ జైల్లో ఉన్నప్పుడే కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని కోర్టులో బాధితురాలి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.


ఇవి కూడా చదవండి...

ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ

రాజకీయంగా ఎదిగేందుకు రాముని పేరు వాడుకున్నారు.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 04:36 PM