Share News

తెలంగాణ అటవీ శాఖలో కీలక మార్పులు.. హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ డా. సి. సువర్ణ పదవీ విరమణ

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:45 PM

తెలంగాణ అటవీ శాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్ర హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డా. సి. సువర్ణ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు.

తెలంగాణ అటవీ శాఖలో కీలక మార్పులు.. హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ డా. సి. సువర్ణ పదవీ విరమణ
Telangana Forest Department

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణ అటవీ శాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్ర హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్(HoFF) డా. సి. సువర్ణ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సువర్ణను ప్రభుత్వ సేవల నుంచి రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డా.సి.సువర్ణ పదవీ విరమణతో.. ఆ స్థానంలో సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వినయ్ కుమార్‌కు హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌(HoFF) పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.


తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వినయ్ కుమార్ ఈ బాధ్యతలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీఓ ఆర్‌టీ నెం. 915ను విడుదల చేసింది. రాష్ట్ర అటవీ శాఖ పరిపాలనా వ్యవహారాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు: మంత్రి అచ్చెన్నాయుడు

ఘనంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 03:52 PM