Share News

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:48 PM

రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని ఉన్నతాధికారులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన పర్యాటక మండలి సమావేశం జరిగింది.

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు
TG Minister Jupally Krishna Rao

హైదరాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని ఉన్నతాధికారులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన పర్యాటక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త శోభను తీసుకొచ్చేందుకు పలు అంశాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చించారు. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరిలో నవంబర్ లేదా డిసెంబర్‌లో వీటిని నిర్వహించేందుకు ప్లాన్ చేయాలని సూచించారు.


రాష్ట్రంలోని కీలక పర్యాటక కేంద్రాల్లో వారాంతంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని తెలిపారు. సోమశిల, రామప్ప, యాదాద్రి ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. గోల్కొండ, తారామతి బరాదరిలలో జరుగుతున్న పనులపై ఈ సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. పర్యాటక ప్రాంతాల్లో కనీస సౌకర్యాల ఏర్పాట్లపై రాజీ లేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు.


మరుగుదొడ్లు, టెంట్లు, గ్లాస్ హౌస్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. రహదారి పక్కన విశ్రాంతి కేంద్రాలు అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ప్రతి టూరిజం ప్రాజెక్ట్‌కు నోడల్ అధికారులను నియమించాలన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ సమన్వయంతో నగరాన్ని సుందరీకరిస్తామని తెలిపారు. స్కైవాక్‌లు, శిల్పాలతో హైదరాబాద్‌కు కొత్త ఆకర్షణ తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.


తెలంగాణను వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మెడికల్, వెల్నెస్, గోల్ఫ్, ఫిలిం టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మధ్య ప్రాచ్య దేశాల్లో తెలంగాణ టూరిజంపై ప్రచారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. చైనా, వియత్నాం టూరిజం మోడళ్ల గురించి అధ్యయన యాత్రలపై ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.


వరంగల్, సోమశిలలో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్ల ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి జూపల్లి చెప్పారు. రామప్ప దేవాలయం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాజెక్టులకు నిర్దిష్ట కాలపరిమితితో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ

అక్కడే తేల్చుకోండి.. ఆకివీడు రామాలయం పిల్‌పై ఏపీ హైకోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2026 | 06:04 PM