ఒకే ఆధార్.. రెండు జీతాలు.. విచారణకు ఆదేశించిన సీఎస్
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:57 AM
రెవెన్యూ శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగి.. నెలనెలా రూ.2లక్షలకుపైనే జీతం తీసుకుంటున్నారు. పోలీసుశాఖలో మరో ఉద్యోగి.. నెలకు రూ.లక్షన్నరకుపైనే వేతనం అందుకుంటున్నారు.. ఇద్దరి పేర్లు, వివరాలు వేర్వేరు. కానీ.. ఈ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నంబరు ఒక్కటే.
వేర్వేరు శాఖల్లో ఉద్యోగులుగా లక్షల్లో జీతాలు అందుకుంటున్న కొందరు
40 అనుమానాస్పద కేసుల్లో.. 80 మందిని గుర్తించిన తెలంగాణ ఆర్థిక శాఖ
హైదరాబాద్: రెవెన్యూ శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగి.. నెలనెలా రూ.2లక్షలకుపైనే జీతం తీసుకుంటున్నారు. పోలీసుశాఖలో మరో ఉద్యోగి.. నెలకు రూ.లక్షన్నరకుపైనే వేతనం అందుకుంటున్నారు.. ఇద్దరి పేర్లు, వివరాలు వేర్వేరు. కానీ.. ఈ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నంబరు ఒక్కటే. అలా ఒకరిద్దరు కాదు.. 40 ఆధార్ నంబర్లపై ఇద్దరు చొప్పున 80 మంది ఉద్యోగుల వివరాలను తెలంగాణ ఆర్థిక శాఖ గుర్తించింది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులేనని.. ఒక్కొక్కరి వేతనం రూ.లక్షన్నర నుంచి రూ.4 లక్షల వరకు ఉన్నట్టు గుర్తించింది. దీనితో ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అంతర్గత విచారణ చేపట్టాలని వివిధ ప్రభుత్వ శాఖలకు శుక్రవారం సర్క్యులర్ జారీచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ‘సమీకృత ఆర్థిక నిర్వహణ, సమాచార వ్యవస్థ (ఐఎఫ్ఎంఐఎస్)లో వివరాలను ఇటీవల పరిశీలించింది. అందులో రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, తాత్కాలిక సిబ్బంది ఆధార్ వివరాలను పరిశీలించే క్రమంలో.. ఒకే ఆధార్ నంబర్‌పై వేర్వేరు పేర్లతో, వివిధ శాఖల్లో ఉద్యోగులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్‌తో రెండు శాఖల్లో, రెండు ఐడీలతో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు పోలీసు, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖల్లో అధికంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలెక్కిన జవాన్.. ఆ తర్వాత అదృశ్యం
మగ్గం తొక్కి.. పిల్లాడిని ముద్దాడి.. చేనేత కుటుంబాలతో సరదాగా!
For More TG News And Telugu News