Share News

‘ప్రజావాణి’కి ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ అవార్డు

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:09 AM

రాష్ట్ర ప్రభుత్వ సమీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’ పోర్టల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కు, జాతీయ స్థాయి ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారం లభించింది.

‘ప్రజావాణి’కి ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ అవార్డు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సమీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’ పోర్టల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కు, జాతీయ స్థాయి ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారం లభించింది. ముంబైలో జరిగిన ‘పరివర్తన్‌ అవార్డ్స్‌-2026’ కార్యక్రమంలో మహారాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ బీజే సింగ్‌ చేతుల మీదుగా, రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ) డైరెక్టర్‌ జనరల్‌ రవి గుప్తా, ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ అధికారి కే విద్యాసాగర్‌లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.


సీజీజీ సాంకేతిక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి డిజిటల్‌ పోర్టల్‌ను రూపొందించింది. కాగితాలపై జరిగే ఫిర్యాదుల స్థానంలో పూర్తిస్థాయి ఆధునిక, పారదర్శక డిజిటల్‌ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచినందుకు ‘ప్రజావాణి’కి ఈ పురస్కారం దక్కింది.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 06:09 AM