Share News

వయోవృద్ధులు నవసమాజ నిర్మాణంలో పాత్రధారులు

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:04 AM

వయోవృద్ధులు సమాజంలో భాగస్వాములు మాత్రమే కాదని, వారు నవ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే నిర్మాతలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

వయోవృద్ధులు నవసమాజ నిర్మాణంలో పాత్రధారులు
Telangana Senior Citizens Day 2026

  • ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

  • సంక్షేమ సంస్థలకు అవార్డులు ప్రదానం చేసిన మంత్రులు పొన్నం, అడ్లూరి

రవీంద్రభారతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వయోవృద్ధులు సమాజంలో భాగస్వాములు మాత్రమే కాదని, వారు నవ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే నిర్మాతలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. వారి అనుభవం, ఆలోచనలు కుటుంబంతో పాటు రాష్ట్రాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వ దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం-2026’ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


వయోవృద్ధుల సంక్షేమం, సేవ కోసం కృషి చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులకు మంత్రులు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. వయోవృద్ధులను సమాజానికి మార్గదర్శకులుగా గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అవసరమైతే చట్టాల్లో నిబంధనలు మార్చి అయినా సరే వయోవృద్ధులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. వీరికి సీనియర్‌ సిటిజన్‌ బస్‌పాస్‌లు ఇవ్వాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు.


ఇవి కూడా చదవండి...
భర్తను చంపించి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..

బాలికలతో అసభ్య ప్రవర్తన.. తండ్రీకొడుకుల అరెస్టు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 06:04 AM