ఇందిరమ్మ టవర్స్‌కు హెల్ప్‌లైన్ ప్రారంభం
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:58 PM
క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 040-24603572 నంబర్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్: క్యూర్ (CURE) పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ గృహాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 040-24603572 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో దరఖాస్తుదారులకు సమాచారం అందించనున్నారు.
దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తూ, ఆధార్ కార్డు ఒక్కటే సరిపోతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలో ఇతర పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే, రూ.10 వేల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD)ను యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఫ్లాట్ కేటాయించకపోతే అదే బ్యాంకు ఖాతాకు ఈ మొత్తం తిరిగి జమ చేయనున్నట్లు వెల్లడించారు.
క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలు నివాసం ఉండాలని మంత్రి తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారని పేర్కొన్నారు. అలాగే క్యూర్ లేదా ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఇప్పటికే సొంత ఇల్లు లేదా స్థలం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
అర్హుల సంఖ్య అందుబాటులో ఉన్న ఫ్లాట్ల కంటే ఎక్కువగా ఉంటే లాటరీ విధానంలో కేటాయింపులు చేపడతారని తెలిపారు. ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ ధర రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తుందని స్పష్టం చేశారు. మిగిలిన మొత్తంలో లబ్ధిదారుడు తన వాటాగా రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
Also Read:
డీఎస్సీపై విచారణకు సిద్ధం.. వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్
టీమిండియా వైఫల్యాలపై బీసీసీఐ సమీక్ష.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!