జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 28 , 2026 | 10:27 AM
జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా నిర్వహించారు.
న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ధర్నాలో మాట్లాడారు. జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌లను పునరుద్ధరించాలని, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్రం తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి