Share News

తిరుమలకు కల్వకుంట్ల కవిత.. స్వామివారి సాక్షిగా ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Mar 05 , 2026 | 08:35 PM

తెలంగాణలో మరో రెండు నెలల్లో తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీ స్థాపనకు తాము సిద్ధమైనట్లు మరోసారి ఆమె ప్రకటించారు.

తిరుమలకు కల్వకుంట్ల కవిత.. స్వామివారి సాక్షిగా ఏం చెప్పారంటే..
Kalvakuntla Kavitha

హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు నెలల్లో తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీ స్థాపనకు తాము సిద్ధమైనట్లు మరోసారి ఆమె ప్రకటించారు. ఇవాళ(గురువారం) తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లారు కవిత. అలిపిరి నుంచి నడక మార్గాన తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా అలిపిరి వద్ద మీడియాతో కవిత మాట్లాడారు.


ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. 'గత నాలుగేళ్లుగా చేయని తప్పుకు నేను, నా కుటుంబసభ్యులు మానసిక వేదన అనుభవించాం. దేవుడి దయతో నాపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టేసింది. కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకన తిరుమలకు వస్తానని చేసిన మొక్కులు తీర్చుకొనేందుకు వచ్చా. రెండు నెలల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీ స్థాపనకు సిద్ధం.


కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజలకు సేవ చేసే పార్టీ తీసుకొస్తాం. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్, బీజేపీ విఫలమయ్యాయి. కొత్త పార్టీ నినాదం “తెలంగాణ ఫస్ట్”. మైక్రో లెవెల్‌లో ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యం. ఆంధ్ర ప్రజలపై ద్వేషం లేదు, రాజకీయ ఆధిపత్యాన్నే వ్యతిరేకించాం. హైడ్రా పేదలను ఇబ్బంది పెడుతోంది. పెద్దోళ్లకు చుట్టం అయ్యింది. నేనెప్పుడూ పేదల పక్షాన పోరాడతా. నాకు న్యాయం చేసిన న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు' అని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాళేశ్వరంపై కమిషన్ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు: ఏజీ

ముగిసిన కడియం విచారణ.. దానం విచారణ వాయిదా

Updated Date - Mar 05 , 2026 | 08:35 PM