ఇంటర్ ఫస్టియర్‌లో 20 శాతం ఇంటర్నల్ మార్కులు
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:31 AM
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు అమలు చేయనున్నారు.
ఈ ఏడాది నుంచి అన్ని సబ్జెక్టుల్లో అమలు
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు గతంలోనే ప్రకటించగా ఇంటర్నల్ పరీక్షల విధివిధానాలను గురువారం విడుదల చేసింది. ఇప్పటివరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనే సైన్స్ గ్రూపుల్లో ప్రాక్టికల్స్ కొనసాగుతున్నాయి.
గత ఏడాది తొలిసారి ఇంటర్-1 ఇంగ్లీషులో 20ు ఇంటర్నల్ మార్కుల విధానం ప్రారంభించగా ఈసారి అన్ని సబ్జెక్టుల్లో అమలు చేయనున్నారు. ద్వితీయ భాష కన్నడం, తమిళం, మరాఠీ ఉన్నవారికి పాత విధానమే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రయోగ పరీక్షల ద్వారా కూడా గుర్తించాలన్న లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష తెలిపారు.
ఇవి కూడా చదవండి...
భర్తను చంపించి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..
నేటినుంచి అందుబాటులోకి మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్
Read Latest Telangana News And Telugu News