Share News

సైబరాబాద్‌ సీపీ, డీసీపీలకు రెండువారాల జైలు

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:53 AM

ఒక భూవివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) ఎం రమేష్‌, డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌ కోటిరెడ్డిలకు హైకోర్టు గురువారం 2 వారాల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది.

సైబరాబాద్‌ సీపీ, డీసీపీలకు రెండువారాల జైలు
jail

  • కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష విధించిన హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఒక భూవివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) ఎం రమేష్‌, డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌ కోటిరెడ్డిలకు హైకోర్టు గురువారం 2 వారాల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 33/8లో ఉన్న 6.15 ఎకరాల భూమికి సంబంధించి ప్రవీణ్‌ అప్పలనేని, టీ హర్షవర్ధన్‌ ప్రసాద్‌ మధ్య సివిల్‌ కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో పోలీసుల జోక్యాన్ని నివారించాలని ప్రవీణ్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. ధర్మాసనం ఆయనకు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆ స్థలంలో ప్రవీణ్‌ పొజిషన్‌ను కాపాడుకోవడానికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, కమిషనర్‌ను కలిసి హైకోర్టు ఉత్తర్వుల గురించి వివరించినా చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ.. ప్రవీణ్‌ ఇటీవల కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీపీ, డీసీపీ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఇద్దరికిరెండు వారాల చొప్పున జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అప్పీల్‌కు వెళ్లడానికి వీలుగా జైలుశిక్ష అమలును ఒక వారంపాటు నిలిపేసింది.

bhoodan-court.jpg

ఇదే కేసులో ప్రతివాదిగా ఉన్న హోంశాఖ ముఖ్యకార్యదర్శి శిఖాగోయెల్‌పై ఆరోపణలు రుజువు కాకపోవడంతో ఆమెపై విచారణను ముగించింది.

ఇవి కూడా చదవండి..

ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు?

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్

Updated Date - Nov 27 , 2026 | 01:54 AM