Share News

ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువులోపు సాధించాలి.. భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 09:49 PM

తెలంగాణ ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్షను నిర్వహించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువులోపు సాధించాలి.. భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణ ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆదాయ వనరుల బలోపేతానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువులోపు సాధించాలని నిర్దేశించారు. ‘ఆదాయ వనరుల సమీకరణలో భాగంగా ల్యాండ్ పూలింగ్, భూముల వేలంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి. అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేటలో భూముల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలి’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఆదాయ వనరుల కోసం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్‌పై దృష్టి పెట్టాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ భూములకు వేలాలు నిర్వహించాలని ఆయన మార్గనిర్దేశం చేశారు. భూముల వేలానికి అనువైన లేఅవుట్ల గుర్తింపునకు ఆదేశాలూ ఇచ్చారు. ప్రభుత్వ భూముల వివరాల కోసం ప్రత్యేక డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల సమర్థంగా వినియోగించుకుని అదనపు ఆదాయం పెంచాలన్నారు. ప్రజా ప్రయోజనాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భూముల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలని భట్టి విక్రమార్క వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

హైదరాబాద్‌లో బాణసంచా అనుమతులపై ఏసీబీ దాడులు.. రూ.30 వేల నగదు స్వాధీనం

కాళేశ్వరం కూలినా ఎస్సారెస్పీ ద్వారా నీళ్లందించాం: మంత్రి ఉత్తమ్

Updated Date - Nov 06 , 2026 | 09:49 PM