Share News

క్రిస్టియన్ మైనారిటీలకు శుభవార్త.. సంక్షేమ పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం

ABN , Publish Date - Jul 03 , 2026 | 07:11 PM

రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఓబీఎంఎంఎస్ (OBMMS) పోర్టల్‌ను ప్రారంభించారు.

క్రిస్టియన్ మైనారిటీలకు శుభవార్త.. సంక్షేమ పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం
Christian Minority Welfare Schemes

హైదరాబాద్: రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఓబీఎంఎంఎస్ (OBMMS) పోర్టల్‌ను ప్రారంభించారు. అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ అభ్యర్థులు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుట్టు మిషన్, పెట్టీ బిజినెస్, బైక్, ఈ-బైక్ వంటి స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జులై 3 నుంచి జులై 18 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు.


మహిళలు, యువత స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా OBMMS వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.


Also Read:

పరీక్ష లేకుండానే నేవీ జాబ్.. పూర్తి వివరాలు ఇవే

భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదు : కందుల దుర్గేష్

Updated Date - Jul 03 , 2026 | 07:52 PM