Share News

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఐఏఎస్ అధికారుల బదిలీలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:56 PM

తెలంగాణలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఐఏఎస్ అధికారుల బదిలీలు
IAS reshuffle Telangana

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు, పర్యాటక రంగం అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, అందుకు అనుగుణంగా సీనియర్ అధికారులకు బాధ్యతలను కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వులు (G.O.Rt.No.431) జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి వాణి ప్రసాద్‌కు ఈ బదిలీల్లో అత్యంత కీలకమైన పోస్టింగ్ లభించింది.


సీనియర్ ఐఏఎస్ అధికారిణి వాణి ప్రసాద్‌ను యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. జయేష్ రంజన్‌ను ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఇకపై పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతారు. పట్టణాభివృద్ధి శాఖతో పాటు క్రీడల శాఖ, ఎఫ్ఏసీ బాధ్యతలను కూడా జయేష్ రంజన్ యధావిధిగా నిర్వహిస్తారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేస్తూ అధికారిక జీవో జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

చేనేత కార్మికులకు ఆర్డర్లు రద్దు చేయడంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం..

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు

For More AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 07:33 PM