'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో సైబర్ సెక్యూరిటీ దాడులు
ABN , Publish Date - Mar 10 , 2026 | 09:17 PM
రోజురోజుకీ పెరుగుతున్న సైబర్ దోపిడీలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరిట ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.
హైదరాబాద్, మార్చి 10: రోజురోజుకీ పెరుగుతున్న సైబర్ దోపిడీలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను ఛేదించడమే లక్ష్యంగా 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0'((operation crackdown) పేరిట ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 పేరుతో పోలీసులు(Telangana Cyber Crime Police ) సైబర్ సెక్యూరిటీ దాడులు నిర్వహించారు. సైబర్ మోసాలకు సహకరిస్తున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్‌వర్క్‌లపై చర్యలు చేపట్టారు. 512 మంది సిబ్బందితో 137 పోలీసు బృందాలు ఏకకాలంలో సైబర్ సెక్యూరిటీ దాడులు జరిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 137 బ్యాంక్ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు, దేశవ్యాప్తంగా 9,451 సైబర్ నేరాలకు లింక్ ఉన్న 1,888 ఖాతాలు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో 549 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అలానే 626 మంది అనుమానితులు గుర్తించి.. అందులో 208 మందిని అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిలో 15 మహిళలు, 7 విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వీరి ఖాతాలను అద్దెకు తీసుకుని, ప్రతి ట్రాన్సాక్షన్‌పై 5 శాతం కమిషన్ సైబర్ క్రైమ్ ముఠా ఇస్తున్నాయి. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0లో 208 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్ బుక్‌లు సీజ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జూబ్లీహిల్స్ మర్చంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు అరెస్టయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరవడంలో బ్యాంక్ అధికారులు సహకరిస్తున్నారు. అలాంటి ఉద్యోగులపై బీఎన్ఎస్ సెక్షన్-112ను పోలీసులు ప్రయోగించారు.
ఇవి కూడా చదవండి:
దారుణం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
డాక్టర్ నమ్రత ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ