Share News

మల్లికార్జున్ ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తాజా రాజకీయాలపై చర్చ

ABN , Publish Date - Mar 17 , 2026 | 08:44 PM

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

మల్లికార్జున్ ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తాజా రాజకీయాలపై చర్చ
AICC meeting Revanth Reddy

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన.. ఏఐసీసీ నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ భేటీలో రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కేసీ.వేణుగోపాల్‌కు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే

తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం

Read Latest Telangana News

Updated Date - Mar 17 , 2026 | 09:36 PM