తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒకరోజు పొడిగింపు..
ABN , Publish Date - Sep 12 , 2026 | 10:01 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం మరో రోజుకు పొడిగించింది. శనివారం సభా కార్యక్రమాల అనంతరం అసెంబ్లీని ఈనెల 16వ తేదీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం మరో రోజుకు పొడిగించింది. ఇవాళ (శనివారం) సభా కార్యక్రమాల అనంతరం అసెంబ్లీని ఈనెల 16వ తేదీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22-ఏపై సభలో మాట్లాడనున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వనున్న నేపథ్యంలో చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా.. ఎల్‌నినో ప్రభావంపైనా ఆ రోజు అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, వ్యవసాయ రంగంపై పడే ప్రభావం తదితర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. కాగా, నేటి సమావేశాల్లో 22-ఏ అంశంపై చర్చ జరిగింది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మరోవైపు, ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కారణంగానే సభా సమావేశాలను మరో రోజు పొడిగించినట్లు తెలుస్తోంది.
ఈ వార్త కూడా చదవండి
ఆ భూములను రేవంత్ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోట్లేదు: మహేశ్వర్ రెడ్డి
నిమ్స్‌లో అరుదైన ఘనత.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి