ఎస్ఆర్ అకాడమీకి ‘డీమ్డ్ టు బి వర్సిటీ’ హోదా
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:51 AM
కేంద్ర విద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఎస్ఆర్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కు ‘డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎట్ హైదరాబాద్’ హోదా లభించిందని సంస్థ వీసీ ఎ.వరదారెడ్డి తెలిపారు.
5 దశాబ్దాల విద్యారంగ పయనంలో గుర్తింపు: వీసీ వరదారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఎస్ఆర్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కు ‘డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎట్ హైదరాబాద్’ హోదా లభించిందని సంస్థ వీసీ ఎ.వరదారెడ్డి తెలిపారు. భారతదేశ విజన్-2047 సాధనలో వ్యూహాత్మక పాత్ర పోషించే సంస్థగా ఎస్ఆర్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రూపుదిద్దుకుంటోందని.. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో బహుముఖ ప్రయోగ వేదికలను నిర్మించడం తమ లక్ష్యమని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికత, జీవశాస్త్రాల వ్యవస్థకు అవసరమైన కీలక విద్యా, ఆవిష్కరణల కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
తరగతి గది అభ్యసనంతోపాటు పరిశ్రమల ప్రాజెక్టులు, ఇంటర్న్షి్పలు, ఔత్సాహిక పారిశ్రామిక కార్యకలాపాల్లో తమ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. సెమీ కండక్టర్ డిజైన్, క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, అధునాతన రోబోటిక్స్ వంటి వ్యూహాత్మక రంగాలకు తమ పాఠ్య ప్రణాళికలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. విద్యా రంగంలో తమ ఐదు దశాబ్దాల ప్రయాణంలో ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో 200కుపైగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్న అనుభవం తమకు యూనివర్సిటీ హోదా కల్పించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్లో కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి
పట్టాపగ్గాల్లేని విద్యుత్ డిమాండ్
క్షేత్రస్థాయిలో కరెంటు యంత్రాంగం
Read Latest AP News And Telangana News And International