Share News

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు గుడ్‌న్యూస్.. వారి పిల్లలకు ఉచిత విద్య

ABN , Publish Date - Nov 24 , 2026 | 08:28 PM

సింగరేణిలోని కాంట్రాక్ట్ కార్మికుల కోసం యాజమాన్యం మరో అడుగు వేసింది. ఆ కార్మికుల పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో పదో తరగతి వరకు ఉచిత విద్య అందించేందుకు ముందుకొచ్చింది.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు గుడ్‌న్యూస్.. వారి పిల్లలకు ఉచిత విద్య
Singareni Free Education

హైదరాబాద్, నవంబర్ 24: సింగరేణిలోని కాంట్రాక్ట్ కార్మికుల కోసం యాజమాన్యం మరో అడుగు వేసింది. ఆ కార్మికుల పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో పదో తరగతి వరకు ఉచిత విద్య అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ ఉచిత విద్య సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో 12 ఏరియాల్లో పనిచేస్తున్న దాదాపు 30,000 మంది కార్మికుల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.


అవసరమైన పత్రాలు..

అర్హులైన కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే కార్మికుల గుర్తింపు కార్డు (ఐడీ), ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జిరాక్స్‌ను సంబంధిత హెచ్​ఓడీలకు అందించాలని సింగరేణి యాజమాన్యం తెలిపింది. కాగా సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని 9 పాఠశాలలు ఉన్నాయి. శాశ్వత ఉద్యోగులు, కార్మికులకు వీటి ద్వారా ఉచిత విద్యను ఆ సంస్థ అందిస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకూ ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకనుంది.


ఈ వార్తలూ చదవండి

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

ప్రధాని మోదీకి జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఫోన్.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..

Updated Date - Nov 24 , 2026 | 08:33 PM