Share News

శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - Sep 02 , 2026 | 07:55 PM

హైదరాబాద్‌ శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
Shamshabad Fake Currency Racket

హైదరాబాద్: నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శంషాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.90 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


నిందితులు నకిలీ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎలా చలామణి చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక మరికొందరు ఉన్నారా? నకిలీ కరెన్సీ తయారీకి అవసరమైన సామగ్రిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.

Also Read:

మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్

సైబరాబాద్ పరిధిలో 10 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

Updated Date - Sep 02 , 2026 | 07:55 PM