శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:20 PM
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట సమీపంలో నాగిశెట్టిపల్లి కోళ్ల ఫారాల సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వ్యర్థాలను తరలించే వాహనం వేగంగా బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మేడ్చల్, నవంబర్ 07: జిల్లాలోని శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నాగిశెట్టిపల్లి కోళ్ల ఫారాల సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వ్యర్థాలను తరలించే వాహనం వేగంగా బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి.. శామీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఆ మృతదేహాలను మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు.