గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోంది: ఆర్ఎస్ ప్రవీణ్
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:26 PM
కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గెలుపు కోసం కాంగ్రెస్ అరాచాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను హస్తగతం చేసుకుంది. ఇది తమ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు సోమవారం చైర్మన్లు, మేయర్ల ఎంపిక జరగనుంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపు కోసం కాంగ్రెస్(Congress) అరాచకాలకు పాల్పడుతోందని తాజాగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు.
ఆదివారం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ..' మున్సిపల్ ఎన్నికల్లో 30శాతం ఓట్లను బీఆర్ఎస్(BRS) కొల్లగొట్టింది. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనడానికి ఇదే ఉదాహరణ. పోలీస్ శాఖను సీఎం దగ్గర పెట్టుకుని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మూడు రోజుల ముందే చైర్మన్లు, మేయర్ల ఎంపికకు నోటిఫికేషన్ ఇస్తోంది. కనీసం 15 రోజుల ముందే షెడ్యూల్ ఇవ్వాలి. వారం రోజుల్లోనే అన్నీ పూర్తి చేసి ఎస్ఈసీ మమ అనిపించింది. కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా.. ఈసీ నోటీసులు ఇవ్వలేదు. రేవంత్‌కు అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోంది' అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి..
పైలెట్, కో-పైలెట్‌కు ఒకే ఆహారాన్ని ఎందుకివ్వరు.. ఆసక్తికర కారణం తెలిస్తే..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ నాలుగింటిలో భిన్నమైన చేపను 5 సెకెన్లలో గుర్తించండి..