పైలెట్, కో-పైలెట్‌కు ఒకే ఆహారాన్ని ఎందుకివ్వరు.. ఆసక్తికర కారణం తెలిస్తే..
ABN , Publish Date - Feb 15 , 2026 | 03:55 PM
విమానాలు నడిపే పైలెట్ల విషయంలో విమానయాన సంస్థలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. సాధారణంగా కాక్‌పిట్‌లో పైలెట్, కో-పైలెట్ ఉంటారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన దగ్గర్నుంచి, తిరిగి ల్యాండ్ అయ్యే వరకు వారిద్దరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే.
ఆకాశంలో విహరించే విమానాల గురించి చాలా విషయాలు సాధారణ ప్రజలకు తెలియవు. విమానాలు నడిపే పైలెట్ల విషయంలో విమానయాన సంస్థలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. సాధారణంగా కాక్‌పిట్‌లో పైలెట్, కో-పైలెట్ ఉంటారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన దగ్గర్నుంచి, తిరిగి ల్యాండ్ అయ్యే వరకు వారిద్దరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా వందల మంది ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని ముందుగానే అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. (pilots different food).
కాక్‌పిట్‌లో ఉండే పైలెట్, కో-పైలెట్ భోజనం విషయంలో కూడా కఠిన నియమాలను ఫాలో అవుతుంటారు. పైలట్, కో-పైలట్‌కు ఒకే రకమైన ఆహారాన్ని ఇవ్వరు. అంటే వారిద్దరికీ వేర్వేరు భోజనం ఇస్తారు. దీని వెనుక ఉన్న ఆసక్తికర కారణం ఫుడ్ పాయిజనింగ్. ఒకవేళ వారికిచ్చిన ఆహారంలో ఏమైనా లోపం ఉంటే ఇద్దరూ అస్వస్థతకు గురవుతారు. అందుకే ఇద్దరికీ వేర్వేరు ఆహారం అందిస్తారు. ఒకవేళ వారిలో ఒకరు అస్వస్థతకు గురైనా మరొకరు బాధ్యతల్ని నిర్వహిస్తారు (pilot and co pilot meals).
ఇద్దరూ పైలెట్లు ఒకేసారి అస్వస్థతకు గురి కాకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేస్తారు (cockpit food policy). అయితే ఈ విషయంలో ఒక్కో ఎయిర్ లైన్స్ సంస్థ ఒక్కోలా నియమాన్ని పాటిస్తుంది. చాలా విమానయాన సంస్థలు మాత్రం పైలెట్లకు అందించే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్