లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పిస్తాం: తెలంగాణ డీజీపీ
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:23 PM
అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులు వెంటనే లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపును మరోసారి తెలంగాణ పోలీసులు పునరుద్ఘాటించారు.
అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులు వెంటనే లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపును మరోసారి తెలంగాణ పోలీసులు పునరుద్ఘాటించారు. గత రెండు సంవత్సరాల్లో 588 మంది మావోయిస్టులు లొంగిపోయారని, తెలంగాణాకి చెందిన 15 మంది క్యాడర్‌లు కూడా లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలోకి వచ్చి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు (Telangana DGP).
లొంగిపోతే తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పిస్తామని మావోలకు డీజీపీ హామీ ఇచ్చారు (Maoists surrender appeal). కుటుంబాలతో గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. సమాజంలో గౌరవంతో, స్వేచ్ఛతో, కుటుంబ సభ్యులతో కలిసి జీవించేందుకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. శాంతి, అభివృద్ధి, సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అండర్‌గ్రౌండ్ జీవితం విడిచి కుటుంబాలతో కలసి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
పైలెట్, కో-పైలెట్‌కు ఒకే ఆహారాన్ని ఎందుకివ్వరు.. ఆసక్తికర కారణం తెలిస్తే..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ నాలుగింటిలో భిన్నమైన చేపను 5 సెకెన్లలో గుర్తించండి..