కరువుపై చేతులెత్తేసిన రేవంత్.. ముఖ్యమంత్రిగా అనర్హుడు
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:09 AM
‘ముందస్తుగా దృష్టి పెట్టకపోగా.. కరువు నివారణకు చర్యలు చేపట్టకుండా.. చేతులెత్తేసిన రేవంత్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఎక్కడిది? ఆ పదవికి ఆయన అనర్హుడు’ అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు.
చేతగాని సీఎంగా చరిత్రలో మిగిలిపోతాడు: హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘ముందస్తుగా దృష్టి పెట్టకపోగా.. కరువు నివారణకు చర్యలు చేపట్టకుండా.. చేతులెత్తేసిన రేవంత్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఎక్కడిది? ఆ పదవికి ఆయన అనర్హుడు’ అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. రాజకీయాల కోసం పుట్టిన గడ్డనే కరువు రక్కసికి బలిపెట్టిన ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి అని, ఇంతా చేసి సిగ్గులేకుండా బుకాయింపు మాటలతో ఎవరిని మోసం చేస్తారని సీఎంను ఆయన ప్రశ్నించారు.
‘కరువు పరిస్థితుల్లో రైతులు, ప్రజలకు భరోసా ఇవ్వడం మానేసి భయభ్రాంతులకు గురిచేస్తావా? రేవంత్‌రెడ్డీ.. కరువు రాగానే చేతులెత్తేసిన చేతగాని సీఎంగా నువ్వు చరిత్రలో మిగిలిపోతావ్’ అంటూ శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ఎల్‌నినో గురించి ఆరు నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఈ ఆరు నెలల్లో కరువు నివారణకు తీసుకున్న ముందస్తు చర్యలేంటో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రపంచవ్యాప్త సమస్య అయితే.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరువులేదని, అక్కడ నీటి గలగలలు.. ఇక్కడ రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News