1924లో అర్జెంటీనాకు ఠాగూర్
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:03 AM
రవీంద్రనాథ్ ఠాగూర్ 1924లో అర్జెంటీనా వెళ్లారు.. ఆ సమయంలో విక్టోరియా ఒకాంపొ (1977లో అర్జెంటీనా అకాడమీ ఆఫ్ లెటర్స్‌కు ఎన్నికైన మొదటి మహిళ) దగ్గర రెండు నెలలపాటు అతిథిగా బస చేశారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ 1924లో అర్జెంటీనా వెళ్లారు.. ఆ సమయంలో విక్టోరియా ఒకాంపొ (1977లో అర్జెంటీనా అకాడమీ ఆఫ్ లెటర్స్‌కు ఎన్నికైన మొదటి మహిళ) దగ్గర రెండు నెలలపాటు అతిథిగా బస చేశారు. అక్కడ తన గుర్తుగా రవీంద్రనాథ్ ‘పురబి’ పేరుతో కవితల పరంపరను రచించారు. కాగా 1968లో ఇందిరాగాంధీ అర్జెంటీనాను సందర్శించారు. ఆ సమయంలోనే విక్టోరియా ఒకాంపొకు విశ్వభారతి వర్శిటీ డాక్టరేట్‌ను ప్రకటించగా, దానిని తన పర్యటన సమయంలో ఇందిర ఆమెకు అందించారు.
ఇవి కూడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి