Share News

9:30 నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:04 AM

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు గాయత్రిహిల్స్‌ ఫీడర్‌ పరిధిలో కరెంట్ ఉండదని తెలిపారు.

9:30 నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

  • హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదరాబాద్: బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు గాయత్రిహిల్స్‌ ఫీడర్‌ పరిధి, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిలింనగర్‌, ఆర్ట్‌ గ్యాలరీ ఫీడర్ల పరిధి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏజీ కాలనీ ఫీడర్‌ పరిధి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏఓయూ, ఫోనిక్స్‌ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు బంగారు మైసమ్మ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుంది.


గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శ్రీరామ్‌ నగర్‌ ఫీడర్‌ పరిధి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్మిక నగర్‌ ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుంది.


హైదర్‌నగర్‌: భాగ్యనగర్‌కాలనీ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జయనగర్‌, అరుణసొసైటీ, మాధవినగర్‌, భాగ్యనగర్‌లో విద్యుత్‌ ఉండదన్నారు. అదే విధంగా మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు అడ్డగుట్ట రోడ్డు నంబర్‌ 5, 6 ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు.


city1.2.jpgచిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో మంగళవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ జి. నాగేశ్వరరావు తెలిపారు. అయ్యప్పస్వామి ఆలయం, రెడ్‌బిల్డింగ్‌(మల్లికార్జుననగర్‌), పాలిటెక్నిక్‌ ఏరియా 11కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 1నుంచి 2గంటల వరకు, శివంరోడ్‌, విద్యానగర్‌, టీఆర్‌టీ క్వార్టర్స్‌ పరిధిలో మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు.


హైదర్‌నగర్‌: భాగ్యనగర్‌ కాలనీ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జయనగర్‌, అరుణసొసైటీ, మాధవినగర్‌, భాగ్యనగర్‌లో విద్యుత్‌ ఉండదన్నారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు అడ్డగుట్ట రోడ్డు నంబర్‌ 5, 6 వరకు విద్యుత్‌ ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 17 , 2026 | 07:04 AM