ఆ ఏరియాల్లో.. 10గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్
ABN , Publish Date - Feb 14 , 2026 | 06:59 AM
ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-2 పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్‌కుమార్ తెలిపారు.
చిక్కడపల్లి(హైదరాబాద్): ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-2 పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్‌కుమార్ తెలిపారు. బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, నారాయణగూడ, వైఎంసీఏ, మెహిఫిల్ హోటల్, లక్డీకాపూల్, మీరా థియేటర్ 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు, లక్డీకాపూల్ పరిధిలో ఉదయం 12గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, ఏజీ ఆఫీస్ పరిధిలో మధ్యాహ్నం 3గంటల నుంచి 4వరకు, రాజేంద్ర ఆయిల్‌మిల్, ఆర్టీసీ కల్యాణమండపం, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, విద్యానగర్ లేన్, దత్తానగర్, ఉర్దూహాల్ పరిధిలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
ఉప్పల్: విద్యుత్ మరమ్మతుల నేపథ్యంలో ఉప్పల్ 33/11 కేవీ సబ్ స్టేషన్ నుంచి వెళ్లే కొన్ని ఫీడర్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏసీ ఎం.నిఖిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 కేవీ బ్యాంక్ కాలనీ ఫీడర్ పరిధిలోని బ్యాంక్ కాలనీ, ప్రశాంత్ నగర్, బీరప్పగడ్డ, ఇంద్రానగర్, అంబేడ్కర్ నగర్, జాహీద్ నగర్, పిస్తా హౌస్ ఉప్పల్ పరిసర ప్రాం తాల్లో ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే సీడీఎఫ్డీ ఫీడర్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం, ఎంఆర్‌ఓ కార్యాలయం, డీఎంహెచ్‌ఓ కార్యాలయం, టీజీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ కార్యాలయం, పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:00 నుంచి సాయం త్రం 5:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వెల్లడించారు.
హైదరాబాద్: బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. - ఉదయం 9-11 గంటల వరకు లక్ష్మీనగర్ ఫీడర్ పరిధి, 9:30-11 గంటల వరకు గాయత్రి హిల్స్ ఫీడర్ పరిధి, 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెయిన్‌బో ఆస్పత్రి ఫీడర్ పరిధి, 10:45-11 గంటల వరకు జింఖాన క్లబ్ ఫీడర్ పరిధి. - ఉదయం 11-11:45 గంటల వరకు ఎల్వీ ప్రసాద్ ఫిలిం ల్యాబ్ ఫీడర్ పరిధి, 11:45-12:30 గంటల వరకు సినీమ్యాక్స్ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 12:30 నుంచి ఒంటిగంట వరకు ఎల్వీ ప్రసాద్ మార్గ్ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 12:30-1:20 గంటల వరకు సాగర్ సొసైటీ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2-3 గంటల వరకు రామానాయుడు స్టూడియో ఫీడర్ పరిధి. - మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కృష్ణానగర్, గౌరీశంకర్ కాలనీ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రహ్మత్ నగర్ బంగారు మైసమ్మ ఫీడర్ పరిధి, సాయంత్రం 4-5 గంటల వరకు జలగం వెంగళరావు పార్కు ఫీడర్ పరిధిలోని ప్రాంతాలు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ అంతరాయం ఉంటుంది. - ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వరాజ్‌నగర్ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహాత్మా నగర్ ఫీడర్ పరిధి, సాయంత్రం 4-5 గంటల వరకు కార్మిక నగర్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాలు.
సంతోష్ నగర్: టీఎస్ఎస్పీడీసీఎల్ సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని 11కేవీ భగత్‌సింగ్‌నగర్, ఆటోనగర్, మదర్‌డైరీ (హయత్‌నగర్), విజయ్‌నగర్, ఆల్ ఇండియా రేడియో, హైకోర్టుకాలనీ, ఢీర్‌పార్క్, బ్యాంక్‌కాలనీ (భగత్‌సింగ్), వాంబేకాలనీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాలలో నిర్వహణ పనుల కారణంగా శనివారం విద్యుత్‌సరఫరా నిలిపి వేయబడుతుందని డీఈ తెలిపారు. 11కేవీ భగత్‌సింగ్‌నగర్, ఆటోనగర్, మదర్‌డైరీ(హయత్‌నగర్), విజయ్‌నగర్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, 11కేవీ ఆల్ ఇండియా రేడియో, హైకోర్టుకాలనీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, 11కేవీ ఢీర్‌పార్క్, బ్యాంక్‌కాలనీ(భగత్‌సింగ్) ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు, 11కేవీ వాంబేకాలనీ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు అంతరాయం ఉంటుందని తెలిపారు.
హైదర్‌నగర్: ప్రభుపాద 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నయన్ కన్‌స్ట్రక్షన్స్, ఏవీబీ పురం, సాయిబాబా కాలనీ, రామారావునగర్‌లో విద్యుత్ ఉండదన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆల్విన్‌కాలనీ ఫేజ్-1, ఆల్విన్‌కాలనీ మెయిన్ రోడ్, రాఘవేంద్రనగర్, సాయినగర్‌లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగు
అల్లు వారి.. పెళ్లి పనులు షురూ
Read Latest Telangana News and National News