తెలంగాణలో జనసేన సభకు అనుమతి నిరాకరణ
ABN , Publish Date - Jun 01 , 2026 | 06:59 PM
జనసేన పార్టీ 'నవ నిర్మాణ సంకల్ప సభ'కు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అనుమతి కోసం జనసేన కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు పోలీసులు అనుమతి నిరాకరించారు. జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జూన్ 2న హైదరాబాద్‌లో ఈ సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే శాంతిభద్రతల పరిస్థితులు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. దీంతో సభ నిర్వహణపై ఉత్కంఠ నెలకొనగా, అనుమతి కోసం జనసేన పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:
అన్నదాతకు అండగా ప్రభుత్వం.. చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్
రాయదుర్గం భూములకు భారీ డిమాండ్.. మరోసారి ఆకాశాన్నంటిన ధరలు
For More Latest News