పనిచేయని వేలాది మీటర్లు.. రెండు వారాల్లో కొత్తవి పెట్టేలా చర్యలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 09:20 AM
ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో విద్యుత్ డిమాండ్ సైతం పైపైకి వెళ్తోంది. సాధారణంగా వచ్చే బిల్లుల కంటే వేసవిలో అదనంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో రీడింగ్ రాని విద్యుత్ మీటర్లపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) దృష్టి పెట్టింది.
హైదరాబాద్ సిటీ: ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో విద్యుత్ డిమాండ్ సైతం పైపైకి వెళ్తోంది. సాధారణంగా వచ్చే బిల్లుల కంటే వేసవిలో అదనంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో రీడింగ్ రాని విద్యుత్ మీటర్లపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) దృష్టి పెట్టింది. తమ సంస్థపై ఆర్థిక భారం పడకుండా, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. మార్చి 1 నాటికి గ్రేటర్‌లోని 10 సర్కిళ్లలో 42,623 మీటర్ రీడింగ్ నిలిచిపోయిన విద్యుత్ మీటర్లు మార్చాలని ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో ఒక్కో డివిజన్‌కు 500 కొత్త విద్యుత్ మీటర్లు కేటాయించింది.
ప్రతి నెలా సమస్యలు:
గ్రేటర్ పరిధిలో మొత్తం 67 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రతినెలా వందల సంఖ్యలో మీటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి. అలా స్టకప్ అయిన మీటర్లు ప్రతినెలా మార్చుతున్నప్పటికీ శివారు సర్కిళ్లలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటునట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. నాలుగైదు నెలలుగా కొత్త మీటర్లు లేకపోవడంతో స్టకప్ అయిన మీటర్లను మార్చే వీలు లేకుండా పోయింది. స్టకప్ మీటర్లు ఉన్న విద్యుత్ కనెక్షన్‌దారులకు యావరేజ్ (స్టేటస్-2 కేటగిరి లో విద్యుత్ బిల్లులు జారీ చేస్తుంటారు. దీంతో కొంతమందిపై అదనపు భారం పడే అవకాశాలు కూడా ఉంటాయి.
గ్రేటర్‌లో స్టకప్ మీటర్లు వివరాలు ఇలా..
బంజారాహిల్స్ సర్కిల్లో 924, సికింద్రాబాద్ 1,400, హైదరాబాద్ సెంట్రల్ 1,956, హైదరాబాద్ సౌత్ 2,452, సైబర్ సిటీ 3,286, రాజేంద్రనగర్ 5,212, హబ్సిగూడ 5,928, సరూర్ నగర్ 6,587, మేడ్చల్ 7,178, సంగారెడ్డి, 7,760 ఉన్నాయి. మెుత్తం మీటర్ల సంఖ్య 42,683
సంగారెడ్డి సర్కిల్లో అత్యధికంగా 7,760 స్టకప్ మీటర్లు:
గ్రేటర్ పరిధిలో మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలోని పది సర్కిళ్లలో ఫిబ్రవరి నాటికి సుమారు 42,683 స్టకప్ మీటర్లు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా సంగారెడ్డి సర్కిల్‌లో 7,760, రాజేంద్ర నగర్‌లో 5,212, హబ్సిగూడలో 5,938, సరూర్ నగర్‌లో 6,587, మేడ్చల్లో 7,178, బంజా రాహిల్స్‌లో 224 స్టకప్ మీటర్లు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో కొంతమంది వినియో గదారులు మీటర్లు తీసుకొని వాటిని వాడకుండా వదిలేయడం, వర్షం, ఎండకు మీటర్లు పెట్టడం వంటి కారణాలతో ఎక్కువశాతం మీటర్లు చెడిపోతున్నాయని ఓ అధికారి తెలిపారు. విద్యుత్ శాఖకు మీటర్లు కీలకమని, మీటర్ సేల్స్ పెరిగితే డిస్కంకు ఆదాయం వస్తుందని.. అందుకే మీటర్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏఐ సమిట్‌లో ఊహించని పరిణామం.. అది చైనా రోబో డాగ్.. ఇండియాది కాదు..
ఇండియా ఏఐ సమ్మిట్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. మరో రోజు పొడిగింపు..