Share News

నిమ్స్, ఉస్మానియా నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి రాజనర్సింహ

ABN , Publish Date - Oct 29 , 2026 | 07:48 PM

నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టులో 80 శాతం భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులు 23 శాతం పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.

నిమ్స్, ఉస్మానియా నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి రాజనర్సింహ
Minister Damodar Rajanarsimha

హైదరాబాద్: నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టులో 80 శాతం భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులు 23 శాతం పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు రెండు కీలక ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.


తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ సహా సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి ఆదేశించారు. అలాగే, శాఖల మధ్య సమన్వయంతో నిర్మాణ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పనుల్లో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించారు. మరోవైపు, ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క

Updated Date - Oct 29 , 2026 | 07:51 PM