Share News

Nikhita Murder Case: నిఖిత చివరి కాల్ గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న తండ్రి

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:16 PM

అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగమ్మాయి నిఖిత చివరి మాటలు గుర్తుచేసుకుని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని అన్నారు.

Nikhita Murder Case: నిఖిత చివరి కాల్ గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న తండ్రి
Nikhita Murder Case

హైదరాబాద్, జనవరి 5: అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. తన కూతురి చివరి మాటలు గుర్తుచేసుకుంటూ నిఖిత తండ్రి ఆనంద్ కన్నీటి పర్యంతమయ్యారు. చివరగా హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అని చెప్పిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కిత్రం తన కూతురు అమెరికా వెళ్లిందని.. నిఖితను అర్జున్ శర్మ అనే యువకుడు హత్య చేశాడని ఆరోపించారు. అర్జున్ శర్మ గతంలో తన కూతురు రూమ్మేట్‌గా ఉన్నాడని.. అందరినీ డబ్బులు అడిగి తీసుకునేవాడన్నారు. అలాగే తన కూతురు వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని అంటున్నారని చెప్పారు.


ఆ డబ్బులు విషయంలోనే అడగడానికి అర్జున్ దగ్గరికి నిఖిత వెళ్లినట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారని నిఖిత తండ్రి తెలిపారు. ఆ తర్వాత నిఖితను హత్య చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడని.. అక్కడి నుంచి ఇండియాకి పారిపోయి వచ్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాకు తన కూతురు చదువుకోడానికి వెళ్ళిందని ప్రస్తుతం జాబ్ చేస్తోందని తెలిపారు. చివరిగా డిసెంబర్ 31న ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పిందని... అదే చివరి మాట అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదన్నారు. అధికారులు తన కూతురు మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని నిఖిత తండ్రి ఆనంద్ వినతి చేశారు.


ఇవి కూడా చదవండి...

ఆత్మహత్యకు పాల్పడ్డ జూనియర్ డాక్టర్ మృతి

శాసనమండలిలో ఇదే నా చివరి ప్రసంగం: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 05 , 2026 | 04:35 PM