Share News

హైదరాబాద్‌లో సినీ నటుడి అరెస్ట్.. ఎనిమిదేళ్లుగా అక్రమ నివాసం..

ABN , Publish Date - Mar 14 , 2026 | 08:05 PM

హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటూ, సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటిస్తున్న నైజీరియన్ జాతీయుడిని ఈగల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో సినీ నటుడి అరెస్ట్.. ఎనిమిదేళ్లుగా అక్రమ నివాసం..
Hyderabad Nigerian Actor Arrest

హైదరాబాద్, మార్చి 14: నగరంలోని కొండాపూర్(Kondapur) ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్న నైజీరియన్(Nigerian) జాతీయుడిని ఈగల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తిని విక్టరీ పుయామగన్ (34) అలియాస్ కెన్నీగా గుర్తించిన అధికారులు ఎనిమిదేళ్లుగా భారతదేశంలో ఎటువంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా నివసిస్తున్నట్లు నిర్ధారించారు. నిందితుడిని FRRO (Foreigners Regional Registration Officer) అనుమతులతో స్వదేశానికి డిపోర్ట్ చేశారు. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. విక్టరీ అపుయామగన్ 2018లో ఘనా నకిలీ పాస్ట్‌పోర్ట్(Ghana Passport) సాయంతో భారత్‌లోకి ప్రవేశించాడు. మెడికల్ అటెండెంట్ వీసాపై(Visa) తొలుత ఢిల్లీకి చేరుకున్న కెన్నీ.. ఆ తర్వాత పంజాబ్‌కు వెళ్లి అక్కడ కొంత కాలం జిమ్ ట్రైనర్‌గా పనిచేశాడు. అయితే, తన వీసా గడువు ముగిసినప్పటికీ అధికారులకు దొరక్కుండా అక్రమంగా దేశంలో ఉండిపోయాడు.


2025లో సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్ కు చేరుకున్న కెన్నీ.. ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన శారీరక దారుఢ్యంతో ఇప్పటివరకూ సుమారు 5 సినిమాల్లో చిన్న పాత్రలు దక్కించుకున్నాడు. ఇటీవల విడుదలైన హిందీ మూవీ ‘టస్కరి’లో నటించిన కెన్నీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తెలుగు మూవీ ‘వారణాసి’‌లోనూ నటిస్తున్నాడు. వీసా గడువు ముగిసినా, నకిలీ పత్రాలతో చలామని అవుతున్నాడన్న పక్కా సమాచారంతో ఈగల్ టీమ్ కొండాపూర్‌లో నిఘా పెట్టి అతడిని అదుపులోకి తీసుకుంది. సరైన అనుమతి పత్రాలు లేకపోవడం, నకిలీ పాస్‌పోర్ట్ వినియోగించినందుకు గాను అతడిని అరెస్ట్ చేసి నిబంధనల ప్రకారం స్వదేశానికి పంపించివేశారు.


ఇవి కూడా చదవండి..

మంత్రి ఇంటిపై రాళ్ల దాడి.. యుద్ధక్షేత్రంగా మారిన కోల్‌కతా!

హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం

Updated Date - Mar 14 , 2026 | 08:23 PM