Share News

గాదె ఇన్నయ్యపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ..

ABN , Publish Date - Jun 18 , 2026 | 09:21 PM

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఛార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పలు కీలక అంశాలను వెల్లడించింది.

గాదె ఇన్నయ్యపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ..
NIA Chargesheet

హైదరాబాద్: సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. UAPA చట్టాన్ని ఉల్లంఘించారంటూ 21, డిసెంబర్ 2025న ఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు ముగించి నేడు (గురువారం) హైదరాబాద్ నాంపల్లిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఛార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పలు కీలక అంశాలను వెల్లడించింది.


2025 అక్టోబర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కథా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ఇన్నయ్య రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు ఎన్ఐఏ తన ఛార్జ్‌షీట్‌లో ఆరోపించింది. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేయాలని సుమారు 200మందిని ఆయన ప్రేరేపించినట్లు పేర్కొంది. ‘విప్లవం చనిపోకూడదు’ అంటూ మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించినట్లు తెలిపింది. లొంగిపోయిన మాజీ మావోయిస్టు క్యాడర్లను ఇన్నయ్య బహిరంగంగా విమర్శించినట్లు చెప్పింది. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో పలువురు సీనియర్ మావోయిస్టు నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిపింది.


‘భారత్ బచావో’ అనే ఫ్రంటల్ సంస్థ ద్వారా మావోయిస్టు భావజాల ప్రచారంలో ఇన్నయ్య చురుకుగా పాల్గొన్నట్లు ఆరోపించింది. మావోయిస్టు అంత్యక్రియల వేదికను సంస్థ సిద్ధాంతాల ప్రచారానికి వినియోగించినట్లు గుర్తించింది. మరోవైపు చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ఉగ్రవాద భావజాల వ్యాప్తికీ కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపింది. నిషేధిత సంస్థలకు మద్దతునిచ్చే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క

అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని

Updated Date - Jun 18 , 2026 | 09:25 PM