Share News

కొరియర్ బాయ్‌గా ఇంట్లోకి వచ్చి.. బంగారు గొలుసు లాక్కెళ్లిన యువకుడి అరెస్ట్

ABN , Publish Date - Aug 05 , 2026 | 08:32 PM

హైదరాబాద్‌లో కొరియర్ బాయ్‌గా ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువకుడు మహిళపై పెప్పర్ స్ప్రే చల్లి నాలుగు తులాల బంగారు మంగళసూత్రాన్ని దోచుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, బంగారు మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కొరియర్ బాయ్‌గా ఇంట్లోకి వచ్చి.. బంగారు గొలుసు లాక్కెళ్లిన యువకుడి అరెస్ట్
Miyapur Chain Snatching Case

హైదరాబాద్‌: మియాపూర్ పరిధిలో కొరియర్ బాయ్‌గా నటిస్తూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువకుడు మహిళపై పెప్పర్ స్ప్రే చల్లి బంగారు మంగళసూత్రాన్ని అపహరించిన ఘటన కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కొరియర్ డెలివరీ పేరుతో వచ్చిన నిందితుడు.. మహిళ ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి ఆమె మెడలో ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కుని అక్కడి నుంచి పరారయ్యాడు.


ఈ ఘటనపై బాధితురాలి భర్త మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, బంగారు మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ ఖాజా అర్షద్ (20)గా గుర్తించారు. నిందితుడిపై గతంలో ఏపీలోని కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.


Also Read:

ఇంటర్ కాలేజీలకు ఫైర్ NOC తప్పనిసరి: ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్‌

పార్కింగ్‌ అడ్డాగా హైదరాబాద్‌- శ్రీశైలం హైవే

Updated Date - Aug 05 , 2026 | 08:32 PM