Share News

రక్తదానం ప్రాణాన్ని కాపాడే మానవతా కార్యక్రమం

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:27 AM

రక్తదానం ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా కార్యక్రమమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు.

రక్తదానం ప్రాణాన్ని కాపాడే మానవతా కార్యక్రమం
Damodar Rajanarsimha

  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా కార్యక్రమమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు. ‘జాతీయ వాలంటరీ బ్లడ్‌ డొనేషన్‌ డే’ సందర్భంగా సనత్‌నగర్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతులు క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. యువత, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఎన్జీవోలు, వివిధ సంస్థలు అవగాహన కార్యక్రమాలను, రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపు నిర్వహించిన తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌, ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ, టిమ్స్‌ బృందాన్ని అభినందించారు.


ఇవి కూడా చదవండి...
నో మైనింగ్‌ జోన్‌గా ఫ్యూచర్‌ సిటీ!

వారంలోగా చెక్కులపై సంతకాలు చేయకుంటే చర్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 06:27 AM