Share News

మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

ABN , Publish Date - Nov 25 , 2026 | 07:55 PM

మాదాపూర్ హైటెక్ సిటీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ యువతి సుష్మా చౌదరి(28) మృతి చెందింది. బుధవారం తెల్లవారుజాము స్నేహితుడి బైక్‌పై ఆమె ఇంటికి వెళ్తుంది.

మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
Software Engineer Died

హైదరాబాద్, నవంబర్ 25: నగరంలోని మాదాపూర్ హైటెక్ సిటీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ యువతి సుష్మా చౌదరి(28) మృతి చెందింది. బుధవారం తెల్లవారుజాము స్నేహితుడి బైక్‌పై ఆమె ఇంటికి వెళ్తుంది. ఈ సమయంలో బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఆపై చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. సుష్మా చౌదరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.


ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి స్నేహితుడు సందీప్ నివాసంలో అక్షయ్ కుమార్‌తో కలిసి సుష్మా చౌదరి భోజనం చేసింది. బుధవారం తెల్లవారుజామున అక్షయ్ కుమార్‌ బైక్‌పై ఆమె ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మాదాపూర్ పోలీసులు వివరించారు.

Updated Date - Nov 25 , 2026 | 08:02 PM