Share News

కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. పలు రెస్టారెంట్లకు నోటీసులు

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:45 AM

హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రాంతంలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు గుర్తించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆయా రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. పలు రెస్టారెంట్లకు నోటీసులు
Food Safety Raids Hyderabad

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు గుర్తించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆయా రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.


తనిఖీల్లో సిద్ధిఖీ కబాబ్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా మాంసాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అలాగే, శ్రీ ద్వారకా రెస్టారెంట్‌లో కాలం చెల్లిన బటర్‌, శనగపప్పును సీజ్ చేశారు. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ఆహార తయారీలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.


వైన్ అండ్ డైన్ బార్ తనిఖీల్లో కాలం చెల్లిన పుట్టగొడుగులను (మష్రూమ్స్) గుర్తించారు. అంతేకాకుండా కిచెన్‌లో పప్పులు నిల్వ ఉంచే ప్రదేశంలో ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత రెస్టారెంట్ల యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.


Also Read:

రైతుల ఖాతాల్లోకి రూ.361.41 కోట్లు

ఈ కలలను ఎవరికీ చెప్పొద్దు.!

Updated Date - Jul 09 , 2026 | 12:51 PM