ఈ కలలను ఎవరికీ చెప్పొద్దు.!
ABN , Publish Date - Jul 09 , 2026 | 10:47 AM
రాత్రి వచ్చిన కలలను ఉదయం కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోవడం చాలామందికి అలవాటు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలను ఇతరులకు చెప్పకూడదని అంటారు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది ఉదయం నిద్రలేవగానే రాత్రి వచ్చిన కలలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుంటుంటారు. అయితే, స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలను ఇతరులకు చెప్పకూడదని చెబుతారు. అలాంటి కలలను రహస్యంగా ఉంచితే వాటి శుభఫలితాలు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేవతలు దర్శనమిచ్చినట్లు కల
కలలో దేవి లేదా దేవతలు కనిపిస్తే అది చాలా శుభసూచకంగా భావిస్తారు. జీవితంలో మంచి మార్పులు, విజయాలు, శుభవార్తలు వచ్చే సూచనగా దీనిని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది. అందుకే ఈ కలను ఇతరులతో పంచుకోవద్దని చెబుతారు.
నీళ్లు ఇస్తున్నట్లు కల
తల్లిదండ్రులకు మీరు తాగడానికి నీళ్లు ఇస్తున్నట్లు కలలో కనిపిస్తే అది గౌరవం, పేరు ప్రతిష్ఠ పెరగడానికి సంకేతంగా భావిస్తారు. ఈ కలను కూడా రహస్యంగా ఉంచితే మంచిదని స్వప్న శాస్త్రంలో పేర్కొంటారు.
ధనంతో నిండిన కలశం కనిపించడం
కలలో బంగారం, వెండి నాణేలు లేదా డబ్బుతో నిండిన కలశం కనిపిస్తే అది ఆర్థిక పురోగతికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచనగా భావిస్తారు. ఈ కలను ఇతరులకు చెప్పకుండా ఉంటే శుభఫలితాలు త్వరగా లభిస్తాయని నమ్మకం.
తెల్ల ఆవు కనిపించడం
హిందూ సంప్రదాయంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. కలలో తెల్ల ఆవు కనిపించడం జీవితంలోని కష్టాలు తొలగి, మంచి రోజులు ప్రారంభం కానున్నాయనే సంకేతంగా స్వప్న శాస్త్రం చెబుతోంది.
Note: ఇందులోని సమాచారం స్వప్న శాస్త్రంలో పేర్కొన్న విషయాలు సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది.. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వాటిని వ్యక్తిగత నమ్మకాల కోణంలో మాత్రమే చూడాలి. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్