Share News

రేవంత్‌ సర్కారుది లూటీ పాలన

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:13 AM

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ లూటీ పాలన సాగిస్తోందని, పాలన పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

రేవంత్‌ సర్కారుది లూటీ పాలన
KTR

  • త్వరలో దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్‌ కీలకం: కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ లూటీ పాలన సాగిస్తోందని, పాలన పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌ హడావుడి కేవలం ఏడాదేనన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో నెలకొన్న వ్యతిరేకత నేపథ్యంలో త్వరలో రాష్ట్రానికి కేసీఆర్‌ సీఎం కావడంతోపాటు ఆయన దేశ రాజకీయాల్లో కీలకమయ్యే రోజులు అతి దగ్గర్లో ఉన్నాయని జోస్యం చెప్పారు.


తెలంగాణ భవన్‌లో శుక్రవారం అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా, కేసీఆర్‌పై విమర్శలకే కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. రేవంత్‌ దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయమని కిషన్‌రెడ్డి చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎంత చేసినా లాభం లేదని, ఆయనకు ఎన్ని జాకీలు పెట్టి.. పైకి లేపినా లేస్తలేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ విఫలమైనందు వల్లే బీజేపీపై సీజేపీ పేరుతో యువత పోరాటం చేస్తున్నారన్నారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 06:13 AM