Share News

కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు పూర్తి.. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు..

ABN , Publish Date - May 17 , 2026 | 09:45 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ పోస్టు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చరిత్రాత్మకంగా నిలిచిన 'కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభ'కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ భావోద్వేగ పోస్టు పెట్టారు.

కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు పూర్తి.. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు..
KCR Simhagharjana Sabha

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ పోస్టు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చరిత్రాత్మకంగా నిలిచిన 'కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభ'కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ భావోద్వేగ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో ఉద్యమ దశ నుంచి నేటి వరకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ ఆరంభ రోజుల నాటి కఠిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.


కేటీఆర్ ఎక్స్ పోస్టు..

'చరిత్రాత్మక కరీంనగర్‌ కేసీఆర్‌ సింహ గర్జన సభకు 25 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు 25 సంవత్సరాల క్రితం 17 మే 2001న సింహ గర్జన సభ జరిగింది. నాటి నుంచి నిన్నటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్‌ది అదే జోష్. అప్పట్లో కనుచూపు మేరా అంతా అంధకారమే.. ఎటు చూసినా ప్రతికూలతలే. గత కాలపు గాయాలు, వెంటాడే వైఫల్యాలు.. ఆ వెంటే అపనమ్మకాలు.. ఇది కేసీఆర్‌ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి. ధన బలం లేదు. రాజకీయ బలగం పెద్దగా లేదు. అయినా సభాస్థలికి జనం పోటెత్తారు. తనను కన్నభూమి తెలంగాణ ఎందుకిలా గోస పడుతుందన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా పొంగే తెలంగాణ ప్రేమ, రాష్ర్టాన్ని సాధించాలన్న నిండైన పట్టుదల, ప్రజలు అండగా ఉంటారన్న భరోసా ఈ నాలుగే ఉద్యమ నాయకుడు కేసీఆర్‌‌ని నడిపించిన రథ చక్రాలు. జై కేసీఆర్, జై తెలంగాణ' అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు.


కేటీఆర్ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్యమ కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున కేటీఆర్ పోస్టును షేర్ చేసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..

బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: కేటీఆర్

Updated Date - May 17 , 2026 | 09:53 PM