నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:19 AM
నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందడానికి ప్రయత్నించిన 37 మంది అభ్యర్థులపై కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కఠిన చర్యలు తీసుకుంది.
37 మంది అభ్యర్థులపై కాళోజీ వర్సిటీ వేటు
వరంగల్ మెడికల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందడానికి ప్రయత్నించిన 37 మంది అభ్యర్థులపై కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కఠిన చర్యలు తీసుకుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వీరంతా తెలంగాణ ఎస్టీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు గిరిజన సంక్షేమ శాఖ నివేదికలో తే లింది.
ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన 37 మందిని ఎస్టీ కేటగిరి నుంచి వర్సిటీ తొలగించింది. వీరికి ఇకపై జనరల్ కేటగిరి (మెరిట్) కింద మాత్రమే ప్రవేశాలు పొందే అవకాశం ఉం టుందని అధికారులు స్పష్టం చేశారు. ఎస్టీ కోటా కింద ఇప్పటికే ఎంబీబీఎస్ సీట్లు పొందిన 9 మంది ప్రవేశాలనూ రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మన్మోహన్ పేరుతో యూనివర్సిటీ పెట్టాం
రాష్ట్ర ప్రజలు ఓట్లేసి సీఎంను చేస్తే.. సోనియా కుటుంబం కోసం ప్రాణాలిస్తారా?
Read Latest AP News And Telangana News And International News And Telugu News